టీడీపీలో చేరిన ధర్మవరం సుబ్బారెడ్డి
కర్నూలు జిల్లాకు డోన్‌కు చెందిన వైసీపీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తమ పార్టీకి విలువైన నాణెం దొరికిందని అన్నారు. తమ కుటుంబంతో స్నేహం చేస్తున్న ధర్మవరం సుబ్బారెడ్డికి, వారి అనుచరులకు అన్ని రకాలుగా అండదండలందిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కేఈ ప్రతాప్‌ను ఎమ్మెల్యేగా గెలిపించడానికి సిద్ధపడటం శుభపరిణామన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం సబ్బారెడ్డితో పాటు సింగిల్ విండో చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, రెండు వేల మంది ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరారు.








