సముద్ర వాణిజ్యానికి నార్వే సహకారం
స్మార్ట్ గ్రామం, స్మార్ట్ వార్డు తరహాలో స్థానిక పాలనలో సాధికారతను పెంచే వినూత్న ఆలోచనలు తమనెంతో ఆకర్షించాయని నార్వే రాయబారి నీల్స్ రాగ్నర్ చెప్పారు. శాసనసభ వాయిదా అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన నార్వే రాయబారి ఆంధ్రప్రదేశ్లో గల సానుకూలాంశాల గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టేన స్మార్ట్ గ్రామం, స్మార్ట్ వార్డు అమలు తీరును తెలుసుకున్న నార్వే రాయబారి ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంలో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలు వారు సుస్థిర, సైమ్మిళిత, అభివృద్దిని సాధించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. సముద్ర గర్భానికి సంబంధించిన విజ్ఞానంలో నార్వే బలీయంగా ఉందని, చమురు, సహజవాయువుల వెలికితీతలో నార్వే ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని ముఖ్యమంత్రికి చెప్పారు.













