వెంకన్న భక్తులకు శుభవార్త
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్టీతో శ్రీవారి లడ్డూప్రసాదం ధర పెరుగుతుదని భావించిన భక్తులకు రాష్ట్ర అర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటనతో ఊరటకలిగింది. జిఎస్టి ప్రభావం తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారి లడ్డూపై వుండదని, తిరుమలలో 500 రూపాలయ ఆపై అద్దెగదులు, అతిధిగృహాలకు మాత్రమే జిఎస్టి ప్రభావం వుంటుందని వెల్లడించడంతో భక్తులకు కొంత ఆనందం కలిగిస్తోంది. ఇప్పటికిప్పుడే శ్రీవారి భక్తులపై మాత్రం లడ్డూధరను భారం చేయలేకపోయింది. ప్రస్తుతం మార్కెట్లో వున్న ధరలకు అనుగుణంగా లడ్డూప్రసాదం తయారీకి వినియోగిస్తున్న ముడిపదార్థాల ధరలు కూడా పెరగడంతో లడ్డూతయారీకి 35 రూపాయలకు వరకు ఖర్చు అవుతోందని టిటిడి వర్గాలు అంచనావేస్తోంది. దీంతో లడ్డూధర పెంచకతప్పదనే యోచనలో భావిస్తోంది. కల్యాణలడ్డూను 150 రూపాయలు చేయాలనే యోచనలో వున్నట్లు సమాచారం. లడ్డూధరలను పెంచితే దీని ప్రభావం అధికారంలో వున్న ప్రభుత్వంపై చూపుతోందనే వాదన ఇటు భక్తులనుంచి, టిటిడి అధికారుల నుంచి వినిపిస్తోది. ఈ నేపధ్యంలో లడ్డూల ధరను జిఎస్టి నుంచి మినహాయింపునిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటనతో భక్తుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.








