తెలుగుజాతికి దక్కిన అరుదైన గౌరవం
జాతీయస్థాయిలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించటంతో ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా చవటపాళెం గ్రామస్థులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుజాతికి దక్కిన అరుదైన గౌరవమంటున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నతనంలో తమ గ్రామం లోని వీధిదీపాల కింద చదివిన వెంకయ్య, ఇంతటి గొప్పస్థాయికి చేరటంతో గ్రామానికే గుర్తింపు వచ్చిందని ఆయన పెరిగిన శ్రీరామపురం గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.








