మాస్టర్ రవికర్ రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందన
ఇండో-పాక్ బోర్డర్లోని సరిహద్దులో భద్రత, ఇతర విషయాలను స్వయంగా చూసి వచ్చిన మాస్టర్ రవికర్, వారి తల్లిదండ్రులు నరసింహరెడ్డి, ఇందిరలతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. ఈ సందర్భంగా మాస్టర్ రవికర్ను ముఖ్యమంత్రి అభినందించారు. రాష్ట్ర విభజన వలన నవ్యాంధ్రకు ఆదాయం తగ్గిపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారని మాస్టర్ రవికర్ చెప్పగా అనంతరం ఆయన తల్లిదండ్రులతో సీఎం మాట్లాడుతూ రవికర్ చిన్నవాడైనప్పటికీ పెద్ద ఆలోచనలు కలవడాన్ని కొనియాడారు. పిల్లల అభివృద్ధికి నాలెడ్జ్ ఇన్ పుట్స్ పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు. పాఠ్యాంశాలకు అదనంగా దేశ ప్రముఖులు, ఇత్యాధి ప్రముఖ సంఘటనలు, దేశ భక్తి అంశాలపై పిల్లలకి అవగాహన కల్పించాలని తద్వారా వారు ప్రయోజకులు అవుతారని అన్నారు. రాష్ట్రంలో నూతన చేపట్టిన ప్రాజెక్టుల గురించి రవికర్ ప్రస్తావించగా పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని, వెనువెంటనే ట్రాన్స్పోర్ట్ఏర్పాటు చేయగా పోలవరం సందర్శనకు మాస్టర్ రవికర్ను వెళ్లాడు.








