జూన్ 2న నవనిర్మాణ దీక్ష
నవ నిర్మాణ దీక్షపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 2న నవనిర్మాణ దీక్షను, 8న మహా సంకల్పం దీక్షను విజయవంతం చేయాలని ఆయన అన్నారు. వారంలో ఒక్కో రోజు ఒక్కో అంశంపై దీక్ష పూనాలన్నారు. కార్యచరణ చేపట్టాలని, మూడేళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది మంచి అవకాశమని అన్నారు. గతేడాది అందరికీ విద్యుత్ సంకల్పం సాధించామని ఆన్నారు. ఈ ఏడాది అందరికీ వంటగ్యాస్ సంకల్పం సాధించామని తెలిపారు. వచ్చే ఏడాది మరో సంకల్పం నెరవేరుస్తామన్నారు. ఆర్థిక లోటు అధిగమించేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.













