గుర్తింపు ఉన్న విద్యాసంస్థల్లోనే చేరాలి : నాట్స్
అమెరికాలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థల్లోనే విద్యార్థులు చేరాలని నాట్స్ అధ్యక్షుడు మన్నవ మోహన్‌కృష్ణ సూచించారు. గుంటూరులో విద్యార్థులతో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను అమెరికా పంపుతున్నారని, కొన్ని సంస్థలు విద్యార్థులను మోసగిస్తున్నట్లు తెలిపారు. గుర్తింపులేని సంస్థలో చేరి ఇబ్బందులు పడుతున్న అనేకమంది విద్యార్థులకు తెలుగు సంస్థలు అండగా ఉంటున్నాయని తెలిపారు.








