చిరంజీవి కుటుంబానికి చెక్ అందజేసిన కోడెల
అమెరికాలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి తెలుగు సంస్థలు అండగా నిలవడం అభినందనీయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. అమెరికాలో చదువుకుంటూ అనారోగ్య కారణాలతో మృతి చెందిన చిరంజీవికి నాట్స్ ఇచ్చిన 6 లక్షల 66 వేల రూపాయల మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. విదేశాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా మనమంతా ఏకమై ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.








