ఏపీ మంత్రులు తాతలయ్యారు
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు మంత్రులు ఒకేసారి తాతలయ్యారు. మనవడిని ఎత్తుకుని మురిసిపోయారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తె శరణికి, మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాస్ కుమారుడు రవితేజలకు నవంబర్ 2015లో వివాహం జరుగగా, ఈ దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టాడు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో నారాయణ కుమార్తె శరణి పురుడు పోసుకుంది. మనవడు పుట్టాడని తెలుసుకున్న వియ్యంకులు గంటా, నారాయణలు ఆసుపత్రికి వెళ్లి బిడ్డను చేతుల్లోకి తీసుకుని మురిసిపోయారు.








