గాల్వాన్ విషయంపై క్లారిటీ ఇచ్చిన నరవాణే.. ఎందుకు చెప్పినట్లు?
గాల్వాన్ లోయలో భారతీయ సైనికులకు, చైనా సైన్యానికి మధ్య జూన్ 2020 లో తీవ్ర ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆ క్లిష్ట సమయంలో భారత సైన్యాన్ని ‘‘దాని మానాన దానిని వదిలేశారు’’ అన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మాజీ సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవణే స్పందించారు. సైన్యాన్ని తన మానాన తనను వదిలేశారన్న ఆరోపణలను ఖండించారు. అవన్నీ అవాస్తవమైనవని అన్నారు. ఆ క్లిష్ట సమయంలో సైన్యానికి భారత ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభించిందని స్పష్టం చేశారు. ఒకవేళ పరిస్థితి డిమాండ్ చేసి వుంటే, చైనా దళాలపై కాల్పులు జరిపేందుకు తనకు పూర్తి అధికారాలు వుండేవని కూడా ప్రకటించారు.
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన జ్ఞాపకాల పుస్తకం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’అనే పుస్తకం రాశారు. 2020 నాటి భారత్ – చైనా సరిహద్దు ఉద్రిక్తతల గురించి అందులో ప్రస్తావించారు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా అనే సంస్థ ప్రచురించింది.అయితే.. ఇందులో చాలా వివాదాస్పద అంశాలున్నాయని, అప్పట్లో ప్రభుత్వం సరైన విధంగా ప్రతిస్పందించలేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏకంగా పార్లమెంటులోనే ప్రస్తావించారు. విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో ఉన్న ‘రెచిన్ లా’ కనుమ వద్ద చైనా దళాలతో ఘర్షణ తలెత్తినప్పుడు, ఆ జనరల్ ప్రభుత్వం నుండి ఆదేశాలను కోరగా—ప్రధానమంత్రి (రక్షణ మంత్రి ద్వారా)—”మీకు ఏది సరైనదిగా అనిపిస్తే, అది చేయండి” అని ఆయనతో చెప్పినట్లుగా,’’ వుందని రాహుల్ పేర్కొన్నారు.అనేక అనేక అంశాలు ఆ పుస్తకంలో వున్నాయన్నారు రాహుల్.
ఇవి కూడా చదవండి
ఈ నేపథ్యంలోనే తాజాగా ఎం.ఎం. నరవాణే స్పందించారు. ఓ జాతీయ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విమర్శలపై క్లారిటీ ఇచ్చారు.ఆ సమయంలో తనకు అందించిన ఆదేశాలు అత్యంత స్పష్టంగా వున్నాయని, అలాగే సైనికుల భద్రతకు ముప్పువాటిల్లిన పక్షంలో ఏ సమయంలోనైనా కాల్పులు జరిపే హక్కు వుందని పేర్కొన్నారు.అలాగే తన పుస్తకంలో అలజడి రేపే వివాదాస్పద అంశాలేవీ లేవని కూడా స్పష్టం చేశారు.‘‘ నా పుస్తకంలో వివాదాస్పద, సున్నిత అంశాలేవీ లేవు. అలా వున్నాయని కూడా నేను భావించడం లేదు. అయితే ప్రజలకు భిన్న భిన్న దృక్పథాలు వుండటం సహజం. అందరూ ఒకేలా ఆలోచించరు’’ అని పేర్కొన్నారు.
2020లో చైనాతో జరిగిన సైనిక ఘర్షణకు సంబంధించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా, తనకు అవసరమైన పూర్తి మద్దతు రాజకీయ నాయకత్వం నుండి లభించిందని జనరల్ నరవణే పేర్కొన్నారు.అలాగే సైన్యానికి ఎలాంటి స్పష్టమైన ఆదేశాలివ్వకుండా తటపటాయించారన్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలతో నరవాణే విభేదించారు.‘‘క్షేత్ర స్థాయి వాస్తవాలపై నాకు మెరుగైన అవగాహన వుంది. అలాగే నా దళాల సామర్థ్యం ఏంటనే విషయం నాకు స్పష్టమైన అవగాహన వుంది. పూర్తి స్వేచ్ఛ ప్రభుత్వం నాకు ఇచ్చింది’’ అని స్పష్టం చేశారు.
అప్పట్లో తీవ్ర వివాదం రేపిన పుస్తకం…
నరవణే రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’ తీవ్ర వివాదం రేపింది. ఈ బుక్ ను పార్లమెంట్ లో బహిరంగంగా చూపించారు రాహుల్ గాంధీ.దీంతో వివాదం మరింత రేగింది. అసలు తాము ఒక్క పుస్తకం కూడా ప్రచురితం చేయలేదని, డిజిటల్ ఫార్మాట్ లోనూ అందుబాటులో లేదని, దీనిని ఏ రూపంలోనూ మేం పంపిణీ చేయలేదని, బహిర్గతపరచలేదని పెంగ్విన్ హౌస్ ప్రకటించింది. ఇది ఏ రూపంలో బయట వున్నా.. కాపీరైట్ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని, వాటిని వెంటనే స్వాధీనం చేసుకోసుకుంటామని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి








