ఈ నెల 30న ఎమ్మెల్సీగా లోకేశ్ ప్రమాణ స్వీకారోత్సవం
ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30న ఉదయం 9:45 గంటలకు ఎమ్మెల్సీగా ఆయన ప్రమణస్వీకారం చేయనున్నారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి తన కార్యాలయంలో నారా లోకేశ్‌తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఎమ్మెల్యేల కోటాలో లోకేశ్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికైన విషయం తెలిసిందే.







