ఎమ్మెల్సీగా నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించిన పది మంది కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు బచ్చుల అర్జునుడు, కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్, బీటెక్ రవి, పోతుల సునీత, దీపక్‌రెడ్డి, బీజేపీ నుంచి మాధవ్, పీడీఎఫ్ నుంచి కత్తి నరసింహారెడ్డి, శ్రీనివాసులురెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.













