ఐటీలో లక్ష ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం : లోకేష్
ఐటీలో లక్ష ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. సచివాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… డీటీపీ పాలసీపై అన్ని కంపెనీలకు తెలిసేలా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆఫీస్ స్పేస్ నిర్మించిన వాళ్లకి డీటీపీ పాలసీ ద్వారా రెంటర్ గ్యారంటీ, రాయితీలు ఇవ్వాలన్నారు. పెట్టుబడులు పెట్టడానికి సుముఖత చూపిన కంపెనీలతో చర్చలు జరపాలన్నారు. భూ కేటాయింపులు, మౌలిక వసతుల కల్పన త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.








