175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యం: లోకేశ్
వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యనిర్దేశాన్ని చేరుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ నెల 11 నుంచి చేపడుతున్న ‘ఇంటింటికి తెలుగుదేశం’ ద్వారా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. అలాగే ఏవైనా సమస్యలుంటే తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు.








