కేటీఆర్‌కు లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కేటీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని లోకేశ్ ట్విటర్లో శుభాకాంక్షలు చెప్పారు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. లోకేశ్‌కు ట్విటర్లో ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి పరస్పరం కలిసి పనిచేద్దామని కేటీఆర్ అన్నారు.








