రాజ్యసభ ఎంపీ, డీఎండీకే నేత ఎల్.కే. సుధీష్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి లోకేష్
చెన్నై: రాజ్యసభ సభ్యుడు, డీఎండీకే పార్టీ (DMDK party) కోశాధికారి ఎల్.కే. సుధీష్ (L.K. Sudheesh), ఎల్‌కేఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ పూర్ణ జ్యోతి సుధీష్ (Poorna Jyothi Sudheesh) దంపతుల కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) హాజరయ్యారు. చెన్నైలోని ఆర్కే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న మంత్రి లోకేష్, నూతన వధూవరులు డాక్టర్ జన్ను శ్రీ సుధీష్, అఖిల్ రవి కుమార్‌లకు పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. వారిని ఆశీర్వదించారు.







