ఇన్స్టంట్ లోన్ మాఫియాపై ఆది సాయికుమార్ పోరాటం
ఆది సాయికుమార్(Aadhi saikumar) తన కెరీర్లో మరో విభిన్నమైన ప్రయత్నానికి రెడీ అయ్యాడు. ఇటీవల శంభాల(Shambhala) సినిమాతో సక్సెస్ ను అందుకున్న ఆయన, ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ ఈగో రాజాస్(Ego rajas) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెడుతున్నాడు. గురు శరవణన్(Guru saravanan) దర్శకత్వం వహిస్తున్న ఈ ద్విభాషా చిత్ర టీజర్‌ను మాస్ మహారాజా రవితేజ(Ravi teja) రిలీజ్ చేశారు. టీజర్ ఇంట్రెస్టింగ్ కథాంశంతో పాటు ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.
తక్షణ రుణాల పేరుతో సామాన్యులను వలలో వేసుకుంటున్న డిజిటల్ లోన్ యాప్స్ మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని సాగుతున్న ప్రమాదకరమైన వ్యాపార వ్యవస్థను ఇందులో చూపించబోతున్నారు. ఫైనాన్స్ సంస్థలో పనిచేసే స్థానిక వ్యక్తిగా ఆది సాయికుమార్ కనిపించనుండగా, ఆయన పాత్రలోని విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ ఆసక్తి రేకెత్తిస్తోంది. సతీష్(Satish) సామాన్యుడిగా, రామచంద్ర రాజు(Ramachandra raju) ఈ వ్యవహారాలను నడిపించే కీలక వ్యక్తిగా కనిపించనున్నారు.
ఇవి కూడా చదవండి
సామాజిక సమస్యకు కమర్షియల్ అంశాలను జోడిస్తూ గురు శరవణన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మనోజ్ పరమహంస(manoj paramahamsa) సినిమాటోగ్రఫీ, ఘిబ్రాన్(Gibran) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరింత బలాన్ని చేకూర్చాయి. ఎస్జీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్(G. Suresh) నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. టీజర్‌తో మంచి ఆసక్తిని పెంచిన ఈగో రాజాస్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.







