RC17 కోసం రామ్ చరణ్ కసరత్తులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) తన నెక్ట్స్ మూవీ RC17 కోసం స్పెషల్ గా రెడీ అవుతున్నారు. డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makrs), సుకుమార్ రైటింగ్స్(Sukumar writings), టీ-సిరీస్(T Series) సంయుక్తంగా అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవల మూడు రోజుల పాటు ఓ సీక్రెట్ ప్లేస్ లో టూర్ కు వెళ్లి తిరిగొచ్చిన చరణ్.. ఏమాత్రం లేట్ చేయకుండా సినిమా సన్నాహాల్లో నిమగ్నమయ్యారు.
ఇవి కూడా చదవండి
ఈ సినిమా కోసం చరణ్ స్పెషల్ ఫిట్నెస్ ట్రైనింగ్ ను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తన పర్సనల్ ట్రైనర్ పర్యవేక్షణలో స్ట్రిక్ట్ వర్కవుట్స్ చేస్తూ శరీరాకృతిని కొత్తగా తీర్చిదిద్దుకుంటున్నారు. గతంలోనూ పాత్రకు తగ్గట్టుగా తన మేకోవర్ ను మార్చుకున్న చరణ్.. ఈసారి సుకుమార్ ఆలోచనలకు అనుగుణంగా సరికొత్త లుక్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు.
గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం(Rangasthalam) టాలీవుడ్ ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ కాంబినేషన్ తెరపైకి వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. RC17లో చరణ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? సుకుమార్ ఎలాంటి కథా ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.







