టాలీవుడ్లో దుల్కర్ సక్సెస్ మంత్రం ఇదే!
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer salman) తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇతర భాషల మార్కెట్లలోకి వెళ్లేందుకు పాన్ ఇండియా ఇమేజ్‌పై ఆధారపడుతున్న హీరోలకు భిన్నంగా, ఆయన విభిన్న కథలతో తెలుగు ఆడియన్స్ కు చేరువవుతున్నారు. తాజాగా పవన్ సాదినేని(pavan sadhineni) దర్శకత్వంలో వచ్చిన ఆకాశంలో ఒక తార(aakasam lo oka taara) సినిమాకు మంచి రెస్పాన్స్ లభించడం ఈ ప్రయాణంలో మరో కీలక ఘట్టంగా నిలుస్తోంది. ఈ సినిమాపై దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) ప్రశంసలు కురిపించడం కూడా ఆసక్తిని పెంచింది.
దుల్కర్ కెరీర్లో తెలుగు డైరెక్టర్ల సినిమాలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. నాగ్ అశ్విన్(nag ashwin) తెరకెక్కించిన మహానటి(mahanati)లో జెమినీ గణేశన్‌గా మెప్పించిన ఆయన, హను రాఘవపూడి(Hanu raghavapudi) సీతారామం(Sitaramam)తో భారీ ప్రేక్షకాదరణ పొందారు. తర్వాత వెంకీ అట్లూరి(Venky atluri) రూపొందించిన లక్కీ భాస్కర్(lucky bhaskar) తో మరో సక్సెస్ ను తన అకౌంట్ లో వేసుకున్నారు. సాధారణ బ్యాంకు ఉద్యోగి పాత్రలో వైవిధ్యమైన నటన కనబరిచి వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టారు. కల్కి 2898ఏడీ(Kalki 2898AD)లో కెప్టెన్ పాత్రలోనూ కనిపించారు.
ఇవి కూడా చదవండి
దుల్కర్ సక్సెస్‌లను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. భారీ బడ్జెట్లు, స్టార్ ఇమేజ్‌ల కంటే బలమైన కథలు, సహజమైన పాత్రలు నటుడికి విస్తృతమైన గుర్తింపును తీసుకొస్తాయి. తెలుగు డైరెక్టర్లు ఆయనలోని నటుడిని గుర్తించి, విభిన్నమైన పాత్రలను అందించడం ఈ సక్సెస్ కు మెయిన్ రీజన్ గా చెప్పవచ్చు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాలంటే ప్రత్యేకంగా ఒక ఇమేజ్ను నిర్మించుకోవడం కంటే, ఆడియన్స్ మనసులను తాకే కథలను ఎంచుకోవడమే ముఖ్యమని దుల్కర్ ప్రయాణం నిరూపిస్తోంది.







