ఉప ఎన్నికల్లో ఓడితే నా పదవికి రాజీనామా చేస్తా
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం ఖాయమని మంత్రి భూమా అఖిలప్రియా అన్నారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ అభ్యర్థి గెలిస్తే, చంద్రబాబు సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి ప్రజలు బ్రహ్మరథం పట్టినట్టారి, ఓడిపోతే తన వైఫల్యంగానే భావిస్తానని ఆమె సృష్టం చేశారు. ఈ ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి ఓడిపోతే, అందుకు పూర్తి బాధ్యత తీసుకుని తన పదవికీ రాజీనామా చేస్తానని తెలిపారు. కార్యకర్తలంతా తన వెంటే ఉన్నారని, వారంతా పార్టీ విజయం కోసం కృసి చేస్తారని అన్నారు. త్వరలోనే తాను ఇంటింటి ప్రచారానికి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.













