నంద్యాల ఉప ఎన్నిక : కొత్త విధానం
నంద్యాల ఉప ఎన్నికల్లో ఇసీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నూతన విధానంపై జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సత్యనారాయణ రాజకీయ నాయకులకు అవగాహన కలిపించారు. ఈ నెల 23న నంద్యాల ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో ఇవిఎం మిషన్లతో పాటు నూతనంగా వివిపాడ్స్ను ఏర్పాటు చేస్తారు. ఈ విధానం వల్ల ఓటేసిన తక్షణమే ఓటరకు తాను ఏ పార్టీకి ఓటేసిందన్నది స్లిస్ రూపంలో మూడు సెకన్ల పాటు కనపడుతుంది. అనంతరం ఆ స్లిస్ ఓ బాక్సులో పడుతుంది. ఈ స్లిస్ను ఓటరు తీసుకోవడానికి వీల్లేదు. ఈ పద్ధతి వల్ల ఎన్నికలు మరింత పారదర్శకంగా నిర్వహించవచ్చని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈ నూతన విధానం బాగుందని రాజకీయ నాయకులు పేర్కొన్నారు.








