నంద్యాల బరిలో ఎంత మందో తెలుసా?
నంద్యాల ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం సాయంత్రానికి ముగిసింది. మొత్తం 30 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఆరింటిని రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేశ్ తిరస్కరించారు. మిగిలిన 24 మందిలో 9 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 15 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో మిగిలారు. టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అబ్దుల్‌ఖాదర్ తదితరులు పోటీలో ఉన్నారు.








