హిందూపురంలో బాలయ్య పర్యటన
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటన భాగంగా హిందూపురంలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొంటున్నారు. వాహనదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆటోనగర్ సమీపంలో కోటీ 50 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రూ.20కోట్లతో నిర్మించే మార్కెట్‌యార్డ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. బాలకృష్ణ వెంట స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.








