లేపాక్షిలో వ్రేలాడే స్థంభాన్ని నిర్మించిన బ్రిటిష్ ఇంజనీర్ ఎవరో తెలుసా?
చరిత్ర తెలుసుకుందాం, మనసంప్రాదాయాలు పిల్లలకు నేర్పుదాం.
గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా? లేపాక్షి నిర్మాణ కౌశలానికి సాక్షి. రాచరికఠీవి అక్కడి శిల్ప సౌందర్యంలో కన్పిస్తుంది. ఆ రాతి శిల్పాల మాటున చారిత్రక విశేషాలు ఎన్నో.ఎన్నో. 16వ శతాబ్దపు కౌశల్యానికి,శిల్పకళానైపుణ్యానికి,చిత్రకళా విన్యాసానికి నిలువెత్తు నిదర్శనం లేపాక్షి. లేపాక్షి పర్యాటకప్రదేశం.మరి అలనాటి అద్భుత రాతికట్టడాల విశేషాలను చూసొద్దాం రండి మరి. అనంతపురం జిల్లా హిందూపూర్ కి తూర్పుగా 18కి.మీ ల దూరంలోను, బెంగుళూరు – అనంతపురం జాతీయ రహదారిపై గల కుడికండ అడ్డరోడ్డుకు 6 కి.మీ ల దూరంలోను వుంది లేపాక్షి గ్రామం. క్రీ.శ. 15వ శతాబ్ది చివరలో ప్రారంభించబడిన ఈ దేవాలయ కట్టడ సముదాయాన్ని క్రీ.శ. 16వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి అచ్యుతదేవరాయల కొలువులో పెనుగొండ కోటలో కోశాధికారిగా పనిచేసిన విరూపన్న పూర్తి గావించాడని తెలుస్తోంది.
తాడిపత్రి – అత్యద్భుతమైన దేవాలయాలు !! భారతదేశం మొత్తం మీద ఇంత పెద్ద ఎద్దు శిల్పం ఇక్కడ తప్ప మరెక్కడా లేదట. 27అడుగుల పొడవు, 15అడుగుల ఎత్తుతో చెక్కిన ఈ శిల్పం ప్రపంచ ప్రఖ్యాతిపొందింది. హైదరాబాద్ నుండి బెంగళూరు కు వెళ్ళే మార్గంలో జాతీయ రహదారి నుండి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో లేపాక్షి ఉన్నది. హిందూపూర్ నుండి లేపాక్షి 13 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 120 కిలోమీటర్లు. పట్టణ ప్రవేశంలోనే తోటలో అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో కనిపిస్తుంది. ఈ పట్టణంలో ప్రధాన ఆకర్షణ వీరభద్ర స్వామి దేవాలయం. ఇవేకాక పురాతన శివాలయం, మహా విష్ణువుకు అంకితం చేయబడిన దేవాలయాలు కూడా ఉన్నాయి. ముందుగా లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయం నుండి పర్యటన మొదలుపెడదాం !! భక్తుల కోర్కెలను తీర్చే పెన్న అహోబిలం స్వామి !! లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయం అద్భుతమైన శిల్పాలకు ఆలవాలం. ఇక్కడ ఉన్న ప్రతి శిల్పం, ప్రతి స్తంభం మలిచిన తీరు వర్ణనాతీతం. “సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షీ అని పిలిస్తే, జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.”
మరో కథ ప్రకారం చూస్తే… అచ్యుతరాయలు కోశాధికారి విరూపణ్ణ రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకూ పూర్తయి, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు చేరవేసారు. దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు కూడా. అలా లోప- అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు








