టీటీడీ చైర్మన్గా మురళీమోహన్?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్గా చదలవాడ క్రిష్ణమూర్తి పదవీ కాలం ముగుస్తోంది. ఒక నెల మాత్రమే ఆయన పదవిలో కొనసాగుతారు. ఇంకేముంది ఆ పదవి కోసం పైరవీలు ప్రారంభమయ్యాయి. ఎవరికున్న పరిచయాలతో వారు ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రదక్షిణం చేసుకోవడం ప్రారంభించారు. ఎవరెన్ని ప్రదక్షిణలు చేసినా చివరకు ఆ పదవి వరించేది సినీ నటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ మాత్రమేనంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు. మురళీమోహన్ ముందు నుంచీ సున్నిత స్వభావుడు. వివాద రహితుడు. ఏ విషయంలోను అతిగా స్పందించడు. వేంకటేశ్వరస్వామి అంటే భక్తి. కనీసం రెండు నెలలకు ఒకసారైన తిరుమలకు వచ్చి వెళుతుంటారు. ఆయన ఎంపీ కాకముందే చంద్రబాబును కలిసినప్పుడు టీటీడీ చైర్మన్గా కొన్ని రోజులు పనిచేయాలన్న కోరికను తెలిపారట. అయితే అప్పట్లో అవకాశం లేకపోవడంతో చంద్రబాబు విని గమ్మునుండి పోయారు. అయితే ప్రస్తుతం ఆ అవకాశం ఉంది కాబట్టి మురళీమోహన్కే తరువాత ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. అంతేకాదు చదలవాడ తరువాత రాయపాటి సాంబశివరావుకు ఆ పదవి రావాల్సి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో బాబుతో రాయపాటికి మధ్య కొద్దిగా గ్యాప్ రావడంతో ఆయనకు పదవి లేనట్లేనని తేలిపోయింది. ఆసక్తి కలిగించ మరో అంశమేమిటంటే టీటీడీ చైర్మన్ పదవి తనకొస్తే వెంకటేశ్వరుని సేవలో తరించిపోతానని ఈ మధ్య బాలయ్య కూడా తన మనసులో మాటను బయటపెట్టినట్లు సమాచారం. మరి ఆ గోవిందుడు ఎవరికీ ఆ పదవిని దక్కేట్లు చేస్తారో.







