జూన్1, 2 తేదీల్లో ఏపీకి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఈ ఏడాది 96 శాతం వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఎండల నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపింది. రుతుపవనాలు జూన్ 1 లేదా 2 నాటికి రాయలసీమలో ప్రవేశిస్తాయని పేర్కొంది.








