సీఎం చంద్రబాబుతో బాలకృష్ణ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణపై వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే పలువురు నేతలు చంద్రబాబును కలుసుకొని తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి నివాసంలో మంతనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో యనమల, కళా వెంకట్రావు, ధూళిపాళ్ల నరేంద్ర, మృణాళిని, బొజ్జల పాల్గొన్నారు.













