గిరిజన జీవన విధానం
ప్రజలకు తెలియచేసే విధంగా జంగిల్ సఫారీ ఉండాలని రాష్ట్ర పర్యావరణ,అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శ్రీ శిద్దా రాఘవరావు గారు అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.ప్రకాశంజిల్లా దోర్నాల వద్ద అటవీ శాఖ సుమారు 35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన తుమ్మల భైలు జంగిల్ పార్క్ ను మంత్రి శిద్దా సందర్శించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సందర్శకులను ఆకర్హించే విధంగా జంగిల్ సఫారీ అభివృద్ధి చేయాలని,ముఖ్యంగా చెంచుల జీవన విధానం ప్రతిభింభించే విధంగా వారికి ఆదాయం కల్పించి, ఫారెస్ట్ పరిధిలో నివసించే చెంచులును టూరిస్ట్ గైడ్ గా విధులు అప్పగించి వారికి ఆదాయం కల్పించాలని మంత్రి అధికారులకు సూచించారు.త్వరలో తుమ్మల బైలు జంగిల్ సఫారీ ప్రారంభిస్తున్నట్లు.ఈ జంగిల్ సఫారీలో పర్యాటకులు సఫారీకు వాహనాలు,ఆర్చరీ,నేచురల్ వాక్ తతిదర ఏర్పాట్లు చేశామని, ప్రభుత్వానికి,చెంచులుకు ఆదాయ వచ్చేవిధంగా జంగిల్ సఫారీ ఉంటుందని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటర్ యెస్.శరవణన్,మార్కాపురం డి.ఎఫ్.ఓ జయచంద్రారెడ్డి,ఆత్మకూరు డి.ఎఫ్.ఓ సెల్వన్,అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.








