జగన్కు ధైర్యం ఉంటే చర్చకు రావాలి : మంత్రి సవిత సవాల్
కర్నూలు కొండారెడ్డి బురుజు (Konda Reddy Buruju) ఎక్కిన టీచర్లకు తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace) ఎక్కడం పెద్ద లెక్కేం కాదని కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత (Savitha) హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మెగా డీఎస్పీ (DSP)పై విషప్రచారం మానుకుని జనగ్కు ధైర్యం ఉంటే శాసనసభ (Legislative Assembly)లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. డీఎస్సీపై ఎలాంటి అనుమానాలు ఉన్నా అసెంబ్లీ వేదికగా తేల్చుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డీఎస్సీ ద్వారా 16 వేల కుటుంబాల్లో వెలుగులు నింపితే , వైసీపీ వారిని అవానించేలా మాట్లాడుతోందని మండిపడ్డారు.








