ప్రపంచ నగరాలకు దీటుగా అమరావతి
ప్రపంచనగరాల స్థాయిలో మూడు దశల్లో అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి మూడు స్థాయిలో నిర్మాణం అవుతోందన్నారు. రాజధాని మూడు దశల్లో అభివృద్ధి చేస్తామన్నారు. సింగపూర్, మలేషియా నగరాల స్థాయిలో రాజధాని భవనాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. అన్నీ రంగాలు ఇక్కడ అభివృద్ధి చెందేలా నిర్మాణాలు ఉంటాయన్నారు. తొమ్మిది నగరాలు అభివృద్ధితో రాజధాని ప్రాంతం అద్భుతంగా ఉంటుందన్నారు.








