హింసకు వైసీపీ ముందస్తు ఏర్పాట్లు : మంత్రి లోకేశ్
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. కడప (Kadapa)లో మాత్రం హింసకు వైసీపీ (YSRCP) ముందస్తు ఏర్పాట్లతో వచ్చినట్లు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. అసాంఘిక శక్తులపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని, పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.








