పులివెందుల ఆర్వో కార్యాలయం ఎదుట.. వైఎస్ జగన్ నిరసన
వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో ఆర్వో కార్యాలయం (RO Office) ఎదుట వైసీపీ అధ్యక్షుడు జగన్ (Jagan) బైరాయించి నిరసన చేపట్టారు. అక్కడికి వచ్చిన అధికారులతో ఆయన మాట్లాడారు. పులివెందుల (Pulivendula)లో రీపోలింగ్ (Repolling) నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. మీకు పైనుంచి ఆదేశాలు ఏమైనా రావచ్చు. ఒత్తిళ్లు వచ్చినా మీ అధికారాన్ని వినియోగించుకోవాలి. ప్రజాస్యామ్యాన్ని హరిస్తున్న వారిని అడ్డుకోవాలి. మీరు ఏం చేసినా ఇక రెండేళ్లే. ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. ఇప్పుడు జరిగిన అన్ని ఘటనలపై విచారణ చేయిస్తా. నేను పిలుపు ఇచ్చి ఉంటే ఈ ఎన్నికలు ఆగపోయేవి. ప్రజాస్వామ్యంపై గౌరవంతోనే నేను అలా చేయలేదు. మాజీ సీఎం (Former CM) నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా? మా ప్రభుత్వ వచ్చాక ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం అని అన్నారు.








