ఆర్సీ17 హీరోయిన్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. రేసులో ఇద్దరు భామలు!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(ram charan), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(sukumar) కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్సీ17(RC17)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం(Rangasthalam) బ్లాక్‌బస్టర్ సక్సెస్ ను అందుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ ఎంపికపై ఫిల్మ్ నగర్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ధురంధర్(Dhurandar) ఫేమ్ సారా అర్జున్(Sara Arjun)ను హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ మొదట భావించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమెతో చాలాకాలం క్రితమే చర్చలు జరపడంతో పాటు స్పెషల్ ఫొటోషూట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.
మరోవైపు భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Borse) పేరు కూడా హీరోయిన్ రేసులో వినిపిస్తోంది. ఆమెపై కూడా మూవీ టీమ్ టెస్ట్ షూట్ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు హీరోయిన్లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి(Satvika Veeravalli) కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లు తాజాగా ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. హీరోయిన్ విషయంలో చిత్రబృందం ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని సమాచారం.
ఇదిలా ఉండగా, ఆర్సీ17 సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలుకానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మిస్తున్నారు. 2028లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఎంపికపై అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే ఈ సినిమాపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.








