అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకున్న ముగ్గురు సరిగమప కంటెస్టెంట్స్..
సరిగమప–ది నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్, ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగులో!
తమ అద్భుతమైన గానంతో ప్రేక్షకులను అలరిస్తూ, సినిమా పాటలు పాడే అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు జీ తెలుగు సరిగమప కంటెస్టెంట్స్. జీ తెలుగు ప్రతిష్ఠాత్మక రియాలిటీ షో ‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్’ ఈ ఆదివారం స్పెషల్ ఎపిసోడ్‌తో ప్రేక్షకులను అలరించనుంది. ఈ ఎపిసోడ్లో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా ‘జనవరి 12 విడుదల’లో పాడేందుకు ముగ్గురు కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేయనున్నారు.
యాంకర్ సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ టైటిల్ కోసం ప్రతిభావంతులైన కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు. పోటీ రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతున్న తరుణంలో, ఈ వారం ఎపిసోడ్లో ముగ్గురు సింగర్స్ అద్భుత అవకాశాన్ని సొంతం చేసుకోబోతున్నారు. ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్, ప్రముఖ గాయనిఎస్పీ శైలజ, ప్రముఖ దర్శకుడుఅనిల్ రావిపూడి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ సీజన్ ఫినాలే కంటే ముందే ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపే ట్విస్ట్‌లతో కొనసాగుతోంది.
సరిగమప టైటిల్ కోసం పోటీపడుతూనే, సినిమా పాటలు పాడే అవకాశాన్ని అందిపుచ్చుకోవడం కంటెస్టెంట్స్ సంగీత ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలవనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘జనవరి 12 విడుదల’ చిత్రంలో తమ గొంతును వినిపించే అవకాశం ఎవరికి దక్కుతుంది అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది.
అనిల్ రావిపూడిని మెప్పించి ఈ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోనున్న ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవరు? న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకునే ప్రదర్శనలు ఏవి? సినిమా నేపథ్య గానంలోకి అడుగుపెట్టే దిశగా ముందడుగు వేసే అదృష్టవంతులు ఎవరు? సంగీతం, భావోద్వేగాలు, ఉత్కంఠతో నిండిన ఈ ప్రత్యేక ఎపిసోడ్లో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభించనున్నాయి.
‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్’ను నవంబర్ 1, ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో తప్పక చూడండి!








