రష్మిక మైసా నుంచి ఫస్ట్ సింగిల్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి సరికొత్త అవతారంలో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా మైసా ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతోంది. విభిన్నమైన కథాంశంతో పాటు రష్మిక క్యారెక్టర్ కూడా ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచింది.
ఓ మైసారే అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్‌ను నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సాంగ్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండటంతో సాంగ్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రష్మిక స్క్రీన్ ప్రెజెన్స్, మ్యూజిక్ కలయికలో ఈ ఫస్ట్ సాంగ్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్‌ఫార్ములా ఫిల్మ్స్, టి-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రష్మిక కెరీర్లో మరో వైవిధ్యమైన సినిమాగా నిలవనున్న మైసాను నవంబర్ 27, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఫస్ట్ సాంగ్ తో స్టార్ట్ కానున్న ప్రమోషన్స్ రానున్న రోజుల్లో సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చే అవకాశం ఉంది.








