అంచనాలు పెంచుతున్న త్రివిక్రమ్ కొత్త ప్రయత్నం!
టాలీవుడ్లో తనదైన కథనం, పదునైన సంభాషణలు, ప్రత్యేకమైన దర్శకత్వ శైలితో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas) మరోసారి డిస్కషన్స్ లో నిలుస్తున్నారు. ఇప్పటివరకు తనదైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ శైలిలో సినిమాలు తీసిన ఆయన, తాజాగా వెంకటేష్(Venkatesh)తో చేసిన ఆదర్శ కుటుంబం(Aadarsha Kutumbam) సినిమాతో కొత్త జానర్‌ను ట్రై చేశారు. తనకు అలవాటైన కంఫర్ట్ జోన్‌ను దాటి చేసిన ఈ ప్రయోగం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. స్టార్ డైరెక్టర్లు తమ రెగ్యులర్ శైలిని పక్కనపెట్టి కొత్త కథలతో ముందుకు రావడం ఎప్పుడూ ఛాలెంజ్‌తో కూడుకున్న విషయమే.
అయితే ఆదర్శ కుటుంబంతో త్రివిక్రమ్ చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆడియన్స్ కూడా డైరెక్టర్ల నుంచి ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ఆశిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఆయన కెరీర్లో మరో విభిన్నమైన ప్రయత్నంగా నిలుస్తోంది. ముఖ్యంగా వెంకటేష్ తో కొత్త తరహా కథను ఎంచుకోవడం త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్టులపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఇక ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR)తో తెరకెక్కనున్న గాడ్ ఆఫ్ వార్(God Of war). భారీ స్థాయిలో, ఊహించని స్కేల్‌తో ఈ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో ఎన్టీఆర్‌తో చేసిన అరవింద సమేత వీర రాఘవ(Aravinda Samwtha Veera Raghava)లోనే త్రివిక్రమ్ తనలోని మరో యాంగిల్‌ను చూపించారు. ఇప్పుడు ఆదర్శ కుటుంబంతో మరో కొత్త ప్రయోగం చేసిన నేపథ్యంలో గాడ్ ఆఫ్ వార్ లో ఆయన ఎలాంటి కథను, ప్రపంచాన్ని చూపిస్తారన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.








