‘జంగా’ చిత్రంలో శివ పాత్రలో కనిపించనున్న త్రిగుణ్.. రా అండ్ రస్టిక్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్
శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న చిత్రం ‘జంగా’. త్రిగుణ్, నేహా పఠాన్, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ,సమీర్, నాగ మహేష్,భూపాల్, రఘు కారుమంచి, రచ్చ రవి, ప్రధాన పాత్రల్లో రాబోతోన్న ఈ మూవీకి కెవిన్ గడ్డం(శ్రీహరి) కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. తాజాగా హీరో త్రిగుణ్ పాత్రను రివీల్ చేస్తూ పోస్టర్‌ను వదిలారు
‘జంగా’ చిత్రంలో త్రిగుణ్ ‘శివ’ అనే పాత్రలో రా అండ్ రస్టిక్ కారెక్టర్‌ను పోషిస్తున్నారు. తాజాగా వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం త్రిగుణ్ బిగ్ బాస్ ఇంట్లో రప్ఫాడిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ రేసులో త్రిగుణ్ దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. మరో త్రిగుణ్ నటిస్తున్న చిత్రాలకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపై ‘జంగా’ టీం నుంచి వరుసగా అప్డేట్లు రానున్నాయి.
ఈ సినిమాకి కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తుండగా.. వెంకట్ సి. దిలీప్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రసాద్ వర్మ, ప్రేమ్ రాజ్ మాటలు రాయగా.. కాసర్ల శ్యాం, పూర్ణాచారి, కళ్యాణ్ చక్రవర్తి పాటల్ని రాస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. త్రిగుణ్, నేహా పఠాన్, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ,సమీర్, నాగ మహేష్,భూపాల్ రాజు , రఘు కారుమంచి, రచ్చ రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.








