అమరావతిలో అంబేడ్కర్ విగ్రహం
రాజధాని అమరావతికే వన్నెతెచ్చలా, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ కీర్తి, స్ఫూర్తి ప్రతిబింబించేలా, ఆకర్షనీయంగా ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిఖ సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశీయ శిల్పులతో పాటు, విదేశీ శిల్పులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరులోని సాయిబాబా మెగా శిల్పశాల నిర్వాహకులు 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం తయారు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబేడ్కర్ తల భాగం వరకు 18 అడుగుల ఎత్తులో నమూనా విగ్రహాన్ని రూపొందించారు. త్వరలోనే శిల్పులతో సంప్రదింపులు పూర్తిచేసి విగ్రహ తయారీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు.













