ఆ వారెంట్ సీఎంకు కాదు.. తెలుగు ప్రజలకు

బాబ్లీ ప్రాజెక్టు విషయమై ఎనిమిదేళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కొందరు ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వారెంట్ ముఖ్యమంత్రికి కాదని, తెలుగు ప్రజలకు ఇచ్చినట్లయిందని మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం కష్ట, నష్టాల్లో ఉన్న సునాయా సంగా పాలన సాగిస్తున్న చంద్రబాబును చూసి ప్రధాని ఓర్వలేకపోతున్నారన్నారు. తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురికాకూడదనే ఉద్దేశంతో ఎనిమిదేళ్ల కిందట బాబ్లీ ప్రాజెక్ట్‌కు సంబంధించి పోరాటం చేశారని, అయితే ఆ కేసును ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నేడు అరెస్టు వారెంట్లు ఇవ్వడం మోదీ దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. ఈ నెల 23న ముఖ్యమంత్రికి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేందుకు ఆహ్వానించిందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, రైతుల ప్రయోజనాలపై ఆయన ప్రసంగించనున్నారని, అయితే ఆయనను ఐక్యరాజ్య సమితికి వెళ్లకుండా అడ్డుకునేందుకు మోదీ ఇటువంటి పన్నాగం పన్నారన్నారు. 60 ఏళ్లుగా ప్రజలు ఎదురుచూసే పోలవరం 2019లో ప్రారంభం కానుందని, గ్యాలరీ వాక్‌లో మే మందరం పాల్గొనడం పూర్వజన్మ సుకృతమన్నారు.











































































