విశాఖలో మెలిండా గేట్స్ ఫౌండేషన్ అంతర్జాతీయ సదస్సు
అమెరికాకు చెందిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సచివాలయంలో సమావేశమయ్యారు. భూసార పరీక్షలతో పాటు రైతులకు వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు తమ సహకారాన్ని అందిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు చంద్రబాబుకు తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో త్వరలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది.
ఈ ఏడాది నవంబర్ 15, 16, 17 తేదీల్లో విశాఖలో మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి సదస్సు జరగనుంది. నవంబర్ 17న బిల్‌గేట్స్ కూడా ఈ సదస్సుకు హాజరవనున్నారు.
వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే తమ లక్ష్యమని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆసియా విభాగపు ప్రతినిధి మెహతా అన్నారు.








