బ్లాక్‌చైన్ టెక్నాలజీపై అంతర్జాతీయ సదస్సు
ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలకు రక్షణ కవచంగా నిలుస్తోన్న బ్లాక్‌చైన్ టెక్నాలజీపై విశాఖ నగరంలో ఈ నెల 9, 10 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్ సంస్థల సహకారంతో విశాఖ ఫిన్‌టెక్ వ్యాలీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సును ఈ నెల 9న నోవాటెల్ హోటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. 25 దేశాల నుంచి దిగ్గజ సంస్థల సీఈవోలు సహా 400 మంది ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సు ఆన్లైన్ లావాదేవీలకు సైబర్ భద్రత-సవాళ్లపై చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు జేఏ చౌదరితో కలిసి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ విశాఖలో మీడియాతో మాట్లాడారు. దిగ్గజ సంస్థల సీఈవోలు, ప్రతినిధులు 7వ తేదీ రాత్రికే విశాఖకు చేరుకోనున్నారు. సీఈవోలతో 8న ఉదయం 6:30 నుంచి 10:30 మధ్య ఈస్ట్‌పాయింట్ గోల్ఫ్‌క్లబ్‌లో గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ వివరించారు.








