పర్యాటక రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు మంగోలియా ఆసక్తి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన మంగోలియాలో భారత రాయబారి డాక్టర్ టి. సురేశ్ బాబు. పర్యాటక రంగంలో పరస్పర సహకారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ప్రతిపాదనలు వుంచిన రాయబారి సురేశ్ బాబు పచ్చదనం, సుందర ప్రదేశాలకు నెలవైన మంగోలియా ప్రాంతం తెలుగు సినిమా షూటింగులకు అత్యంత అనువైనదని, జనాభాలో 80 శాతం ప్రజలు బుద్దిజంను ఆదరిస్తారని, బౌద్దులకు అత్యంత ఇష్టమైన అమరావతితో మంగోలియా ప్రజలు స్నేహ సంబంధాలు కోరుకుంటున్నారని సురేశ్ బాబు చెప్పారు. మైనింగ్ రంగంలో మంగోలియాలో అపార అవకాశాలు ఉన్నాయని, ఈ రంగంలో కలిసి పనిచేద్దామని సురేశ్ బాబు ప్రతిపాదించచారు.








