నష్టాల్లో ఉన్న గిడ్డంగులు లాభాల్లోకి…ఎల్విఎస్ఆర్కె
నష్టాల్లో ఉన్న గిడ్డంగుల సంస్థను లాభాల్లోకి నెట్టడంలో మాజీ ఎండి ఎస్.ఎన్. మహంతి చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్వీఎస్ఆర్కె ప్రసాద్ అన్నారు. ఆయన వేసిన ప్రణాళికే గిడ్డంగులను లాభాల్లోకి నెట్టిందని చెప్పారు. సంస్థ ఉద్యోగులు, ప్రైవేట్ గిడ్డంగుల సంస్థ యజమానుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన సీనియర్ ఐఎఎస్ అధికారి మహంతి ఆత్మీయ సన్మాన సభలో ప్రసాద్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.








