కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లోకేష్ ఘనస్వాగతం
విశాఖపట్నం: సిఐఐ 31వ భాగస్వామ్య సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు విశాఖపట్నం విచ్చేసిన కేంద్ర విద్య, వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi)కి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఘన స్వాగతం పలికారు. రెండురోజుల సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించడమేగాక భారీఎత్తున పెట్టుబడులు సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మంత్రి లోకేష్ చొరవను జోషి అభినందించారు. కేంద్రమంత్రికి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ (Satya Kumar Yadav), గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar), విశాఖ ఎంపి ముతుకుమిల్లి భరత్ (Bharat) తదితరులు ఉన్నారు.







