ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం
విశాఖపట్నం: సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ (CII Partnership Summit,) ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ (CP Radhakrishnan) కు గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazir), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu,), మంత్రి నారా లోకేష్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర బొబ్బిలి కళాకారులు తయారు చేసిన వీణను మంత్రి లోకేష్ ఉప రాష్ట్రపతికి బహుకరించారు. ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు.







