ఈ నెల 11న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీవారి ఆలయ శుద్ధిలో భాగంగా కోయిల్ అళ్వార్ తిరుమంజనం కార్యక్రమం ఈ నెల 11న నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది. ఈ నెల 16న ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని మందిరం శుద్ధి చేయనున్నట్లు వివరించింది. ఏటా ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మూెత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం ఆలయాన్ని శుద్ది చేయడం ఆనవాయితీ.








