తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు సంవత్సరాది శ్రీ హేమళంబి నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు ఆలయాన్ని శుద్ధి చేపట్టారు. వేకువజామున స్వామివారికి సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్ను పట్టు వస్త్రంతో కప్పి వేశారు. నాముకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పనువు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కల గలిపి పవిత్ర జలంలో ధ్వసస్తంభం వద్ద ప్రదక్షిణగా వెళ్లి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఉదయం 11 గంటలకు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం స్వామివారికి కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం సమర్పించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు నుంచి సర్వదర్శనం ప్రారంభిస్తారు.







