వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ నెల 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువజామున స్వామివారికి సుప్రభాతం నిర్వహించిన అనంతరం శ్రీవారి మూలవిరాట్టును పట్టు పరాదాతో పూర్తిగా కప్పి వేశారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి, ఆలయంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామాగ్రి తదితర వస్తువులను అర్చకులు, ఆలయ సిబ్బంది శుభ్రం చేశారు. శుద్ధి పూర్తియన అనంతరం నాముకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచీలీగడ్డ తదితర సుగంద ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయ అంతటా ప్రోక్షణం చేశారు. ఇందులో భాగంగా ఉదయం 6 నుండి 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేశారు.








