రాయలసీమకు నీళ్లిచ్చిన భగీరథడు చంద్రబాబు
గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి రాయలసీమకు సాగునీరు అందించిన భగీరథడు చంద్రబాబు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 13జిల్లాలు సస్యశామలమవుతాయని ఆయన అన్నారు. అలాగే ప్రపంచంలోని మూడు ప్రధాన నగరాల జాబితాలో అమరావతి నిలుస్తుందని తెలిపారు.ఆగస్టు నాటికి పులికనుమ, సిద్ధాపురం ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.








