కల్పవృక్ష వాహనంపై దర్శినమిస్తున్న స్వామివారు
తిరుమలలో నాలుగో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఛర్నాకోల్ చేతబట్టి, రాజమన్నార్ రూపధారిగా మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాత్రి 9 గంటలకు తిరువీధుల్లో సర్వభూపాల వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు.








